ఎర్రసముద్రంలో చైనాకు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై హూతీలు బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశారు. ఈ దాడితో నౌకలో మంటలు ఎగిశాయి. కానీ, వేగంగా స్పందించి అరగంటలోనే వీటిని ఆర్పేశారు.
అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్, యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ దీనిని ధ్రువీకరించాయి. కాగా చైనా, రష్యా నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని ఇటీవలే హూతీలు ప్రకటించినప్పటికీ ఈ దాడి జరగడం గమనార్హం.