మహరాష్ట్రలోని పుణెలో ప్రసిద్ధి చెందిన దగడూశేఠ్ వినాయక ఆలయంలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సహ్యాద్రి ఫామ్స్ ఆధ్వర్యంలో 2 వేల కిలోల నలుపు, ఆకుపచ్చ ద్రాక్షపండ్లతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
దీంతో అధికసంఖ్యలో ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి వద్ద ఉంచిన ద్రాక్షపండ్లను ససూన్ ఆస్పత్రి, పితాశ్రీ వృద్ధాశ్రమంతో పాటు పలు సంస్థలకు పంపిణీ చేస్తారు.