సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకువస్తోంది. ఓటర్ల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఓటరు హెల్ప్‌లైన్ యాప్ (వీహెచ్ఏ) పేరిట ప్రత్యేక వ్యవస్థను ఎన్నికల సంఘం రూపొందించింది.
ఇందులో ఓటు నమోదు చేసుకునేందుకు వీలుగా దరఖాస్తులు కూడా అందుబాటులో ఉంటాయి. ఓటర్ల జాబితాలో పేరు ఉందా.. లేదా.. అన్నది ఈ యాప్ ద్వారా సులువుగా తెలుసుకునే వీలుంది.