వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఐదేళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు. ఏపీ అభివృద్ధిపై, వైసీపీ పాలనపై ప్రశ్నించిన వారిని వేధించడం, బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు జగన్ పాలనలో తీవ్రంగా నష్టపోయారని వ్యాఖ్యలు చేశారు. సోమవారం మాట్లాడుతూ.. స్వాతంత్రానికి ముందు ప్రజలు పడ్డ కష్టాలని, మళ్లీ వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నారని విమర్శించారు. యువతకు ఒక్క ఉద్యోగం లేదని.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలే ఉండవని ప్రజలకు అర్ధమైందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే జైళ్లలో వేస్తున్నారని... దుకాణాలు పగులగొడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో చేసిన ఏ అభివృద్ధి చెప్పుకోలేక వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. మొన్నటి వరకు నెల్లూరులో మీసాలు మెలేస్తూ సవాళ్లు చేశారని.. వారు చేసిన అభివృద్ది ఏమిటో చెప్పుకోలేరని మాజీ మంత్రి నారాయణ వ్యాఖ్యలు చేశారు.