దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3-5 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ తెలిపింది.
‘వృద్ధి వేగం పుంజుకునే వరకు ఈ రంగంలో నియామకాలు స్తబ్ధుగా ఉంటాయి. ఆందోళనలు ఉన్నా కంపెనీల లాభదాయకత ఆశాజనకంగా ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో పరిశ్రమ కేవలం 2 శాతం వృద్ధిని నమోదు చేసింది.