ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ప్రధానంగా డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీజీపీకి టైమ్ దగ్గర పడింది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల వాహనాలు మాత్రమే తనిఖీ చేయమని డీజీపీ ఆదేశాలు ఇచ్చినట్లు కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారన్నారు. పార్టీ అంతర్గత సమావేశంలో ఇంటెలిజెన్స్‌కి ఏం పని అని లోకేష్ ప్రశ్నించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీని సస్పెండ్ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. అధికార పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్న డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని అన్నారు.