ఇన్స్ట్రా గ్రామ్‌లో అభ్యంతర మెసేజ్‌లు పెట్టి రెండు వర్గాల మద్య అల్లర్లు సృషించడానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో కొంత మంది యువకులు పెనుగొండ పోలీసుస్టేషన్‌పై దాడి చేసిన కేసులో సీసీ కెమేరాలు ఆధారంగా 55 మందిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు స్టేషన్ కిటికీలు ధ్వంసం చేశారన్నారు. సీసీ కెమేరాల ఆధారంగా 22 మందిని గుర్తించామని వారిలో నలుగురిని ఏలూరు బాలురహోమ్కు తరలించామన్నారు. మిగతా 18 మందిని 22న అరెస్టు చేశామని ఇదే కేసులో 23న మరో 33 మందిని గుర్తించామన్నారు. వారిలో పది మందిని బాలురుగా గుర్తించి ఏలూరు బాలుర హోమ్‌కి తరలించి మిగిలిన 23 మందిని ఆదివారం అరెస్టు చేశామన్నారు. ఇప్పటి వరకు 55 మందిని అరెస్టు చేశామన్నారు. సీఐ నక్కా రజిని కుమార్, స్టేషన్ ఎస్ఐ షేక్ సుభాణి, సిబ్బంది పాల్గొన్నారు.