ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రఘురామకు దక్కని సీటు, నిరాశలో అభిమానులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 11:33 AM

నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి తాను పొత్తులో భాగంగా ఏ పార్టీ అయినా పోటీ చేయడం ఖాయమని సిట్టింగ్‌ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు విశ్వాసంతో ఉన్నారు. ఆయన పోటీ ఖాయమని కొందరు పందేలకు సైతం దిగారు. చివరి వరకు ఢిల్లీ బీజేపీ పెద్దలు రఘురామ వైపే ఉంటారని అందరూ భావించారు. దీనికి విరుద్దంగా ఆయనకు పార్టీ పరంగా పోటీ చేసే అవకాశం చేజారింది. నరసాపురం పోటీకి తనకు అవకాశం రాకుండా సీఎం జగన్‌ అడ్డుపడ్డారని చెప్పారు. టిక్కెట్‌ రాకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఆది నుంచి సీఎం జగన్‌ అవినీతిపైన, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన దండెత్తిన ఆయనకు అటు బీజేపీ గాని, ఇత ర పార్టీలు గాని అవకాశం లేకుండా చేయడం దారుణమని అంటున్నారు. నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ఆయన అభిమానులు సోమవారం నిరసనలు వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com