జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూను కాకినాడ పార్లమెంటరీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ కలిశారు. టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ కలయిక నిర్వహించి ఒకరికొకరు సత్కరించుకున్నారు. ఉదయ్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని నెహ్రూ అన్నారు. ఉదయ్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో నన్ను, నెహ్రూను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పోతుల మోహన్‌రావు, కొత్త కొండబాబు, చదరం చంటిబాబు, పాండ్రంగి రాంబాబు, కాకినాడ పార్లమెంట్ జనసేన నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, జ్యోతుల శ్రీనివాస్, పిల్లా శ్రీధర్, కురుమళ్ళ రాంబాబు, జ్యోతుల సతీష్, బీఎన్రాజు, వీర మహిళలు తోలేటి శిరీష, కోలా దుర్గ,పిల్ల రమయ్య ఉన్నారు.