నందికొట్కూరు పరిధిలోని పగిడ్యాల, ఘణపురంలో ఆదివారం రాత్రి శంఖారావం కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్యతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనతరం వైసీపీ కి చెందిన ఘనపురం ఎంపీటీసీ ప్రియాంకతో పాటు ప్రాతకోట గ్రామాలకు చెందిన వంద మందికి పైగా గ్రామస్థులు టీడీపీలోకి చేరారు. టీడీపీ మండల కన్వీనరు పలుచాని మహేశ్వరరెడ్డి, చంద్రేష్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, నాగశేషులు, పాల్గొన్నారు.