తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులు గరుడసేవ నిర్వహించారు. ప్రతినెలా పౌర్ణమి నాడు మలయప్ప స్వామి గరుడ వాహనంపై అధిరోహించి భక్తులకు కటాక్షిస్తారు.
సర్వాభరణాలతో అలరారుతున్న శ్రీమలయప్ప స్వామి గరుడునిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. గరుడ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి దర్శనంతో సప్తగిరిలు గోవింద నామస్మరణతో మారుమోగారు.