వేసవికాలంలో విపరీతమైన వేడి జుట్టు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ కాలంలో కొన్ని చిట్కాలను పాటిస్తే జుట్టుకు ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. వేసవికాలంలో జుట్టు సాధారణ గాలికి అరే విధంగా చూసుకోవాలి. ఎక్కువగా ఎండలో తిరగకూడదు. జుట్టుకు హెయిర్ సీరంను రాస్తూ ఉండాలి. ఇలా రాస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు తేమగా ఉంటాయి. అంతేకాక జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది.
పరగడపున గోరువెచ్చని నీరు తాగితే కలిగే లాభాలివే...
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వలన మన బాడీలోని ట్యాక్సిన్స్‌ని తొలగిస్తుంది. దీంతో జీర్ణశక్తి ఉత్తేజితమై తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం, దగ్గు, అసిడిటీ, జలుబు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. గోరువెచ్చని నీరు తాగుతూ ఉండటం మంచిది. దీని వల్ల పేగులు శుభ్రమై ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి.