వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 370కి పైగా సీట్లు గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి దక్షిణ భారతంపై దృష్టి సారించింది. ముఖ్యంగా తమిళనాడులో ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ రాష్ట్రంలోని కాషాయ దళం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది.
ఈ క్రమంలో అన్నాడీఎంకే బహిష్కృత సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం (ఓపీఎస్)ని తమవైపు తిప్పుకుంది. అన్నా డీఎంకేపై ఆయన్ను అస్త్రంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పన్నీర్‌సెల్వం రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించారు. అక్కడి నుంచి అభ్యర్థిని బరిలోకి దించబోమని వెల్లడించారు.