Vijay Deverakonda Rashmika Mandanna Net Worth: టాలీవుడ్లో బెస్ట్ పెయిర్‌గా గుర్తింపు పొందిన Vijay Deverakonda, Rashmika Mandanna పెళ్లి ఈ నెల 26న జరగనుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు వివాహ ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం వినిపిస్తుండగా, మరోవైపు ఈ ఇద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. దీంతో ఈ వార్తల్లో నిజమెంత అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. ఇండస్ట్రీలో టాప్ స్టార్స్‌గా కొనసాగుతున్న ఈ జంట ఆస్తుల విలువ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.విజయ్ దేవరకొండ ‘నువ్విలా’తో సినీ రంగ ప్రవేశం చేసి, Pelli Choopulu సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత Arjun Reddyతో సంచలన విజయాన్ని అందుకుని స్టార్ హీరోగా ఎదిగారు. Geetha Govindam ద్వారా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ ప్రత్యేక స్థానం సంపాదించారు. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సుమారు రూ.15 కోట్ల విలువైన లగ్జరీ నివాసంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆయన వద్ద BMW 5 సిరీస్, ఫోర్డ్ ముస్తాంగ్, వోల్వో XC90, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. వివిధ నివేదికల ప్రకారం ఆయన నెట్ వర్త్ దాదాపు రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమాలతో పాటు యాడ్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్స్, తన నిర్మాణ సంస్థ ‘King of the Hill Entertainment’, అలాగే ‘Rowdy Wear’ బ్రాండ్ ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు.ఇక రష్మిక మందన్న టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో వరుస విజయాలతో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఆమె నెట్ వర్త్ సుమారు రూ.66 కోట్లుగా అంచనా వేస్తున్నారు. బెంగళూరులో రూ.8 కోట్ల విలువైన లగ్జరీ హౌస్‌తో పాటు హైదరాబాద్, ముంబై, గోవా, కూర్గ్ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఒక్కో సినిమాకు దాదాపు రూ.4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమె వద్ద ఆడి Q3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా, మెర్సిడెస్ బెంజ్ C-క్లాస్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.వీరి పెళ్లి రాజస్థాన్‌లోని City Palace Udaipurలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగనుందనే ప్రచారం ఉంది. అలాగే హైదరాబాద్‌లోని Taj Krishnaలో మార్చి 4న రిసెప్షన్ నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa