తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ప్రతాపం రోజు రోజుకి పెరిగిపోతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే 41 డిగ్రీలు దాటాయి. ఇక రాత్రి పూట పలు ప్రాంతాల్లో 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో మరో మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తిమ్మాపూర్‌లో 41.1 డిగ్రీల సెల్సియస్ నమోదైందని తెలిపారు. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పటాన్‌చెరులో 4.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది. ఆదిలాబాద్‌లో 3.5 డిగ్రీల సెల్సియస్, హయత్‌నగర్‌లో 3.2 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. రానున్న రోజుల్లో ఎండలు తీవ్రమయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.