కళ్యాణదుర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు తనయుడు అమిలినేని యశ్వంత్ మంగళవారం కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్లారి మిట్టపై రోడ్డుకిరువైపుల ఆకుకూరలు, చేపలు, బట్టలు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిరువ్యాపారులకు తగిన సౌకర్యాలు కల్పించి వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు.