పెదనందిపాడు మండలం పాలపర్తి గోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆటో ఢీకొని పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం వేరుశెనగ పంట పీకేందుకు కూలీలతో వెళుతున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మూడు అంబులెన్సులలో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa