లోకేష్ అంటే ప్రభుత్వానికి భయం కాబట్టే అడుగడుగునా తనిఖీ చేస్తున్నారని బుద్దావెంకన్న ఆరోపించారు. మంగళగిరిలో లోకేష్‌ను ఓడించటానికి రూ.500 కోట్లు దాచారని విమర్శించారు. పోలీసు ఎస్కార్ట్‌తో నల్ల డబ్బును సాక్షి వాహనాల్లో రాష్ట్ర మంతటా పంపిణీ చేస్తున్నారా అని నిలదీశారు. ఎన్నికల్లో వైసీపీ వాడే డబ్బంతా ప్రజలదే అని అన్నారు. ఓటుకు రూ.30 వేలైనా మంగళగిరిలో పంచేందుకు సిద్ధమయ్యారన్నారు. ప్రజల నుంచి జగన్ కాజేసిన డబ్బుని ఇప్పుడు పంచుతున్నారన్నారు. ప్రజలు జగన్ ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు మాత్రం సైకిల్‌కు వేయాలని బుద్దావెంకన్న కోరారు.