2024 ఎన్నికల తరువాత వైసీపీలో సీఎం అభ్యర్థి ఎవరన్నది ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటమేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల ప్రతిపక్షాలను విమర్శించడం విడ్డూరమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో నెలజీతగాడు అంటూ కామెంట్స్ చేశారు. ఏపీలో డ్రగ్స్ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపిందన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై సీఎం ఇంత వరకు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని.. డ్రగ్స్‌కు పాత్రధారులు, సూత్రధారులు వైసీపీ నేతలే అని ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను డ్రగ్స్ వ్యవహారంలో ఇరికించే అవకాశం ఉందని మండిపడ్డారు.