నల్లచెరువు మండల కేంద్రంలోని పెద్ద యల్లంపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం కేంద్ర సాయుధ బలగాలతో మరియు బిఎస్ఎఫ్ పోలీసుల సిబ్బందితో స్థానిక ఎస్ఐ లింగన్న ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే ధ్యేయంగా కవాతును నిర్వహిస్తున్నామని ఎస్ ఐ తెలిపారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.