జై భారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర వైయస్ఆర్ సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా గొరకపూడి చిన్నయ్యదొర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్‌రెడ్డి, పెద్దాపురం వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దవులూరి దొరబాబు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa