వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా, కలెక్టర్ జి.సృజన సం బంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యా లయంలో తాగునీటి సమస్య రాకుండా చేపట్టాల్సిన చర్యలపై పంచా యతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, నగర పాలక సంస్థ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు యాక్షన్ ప్లాన్ రూపొందించా లన్నారు. ఎల్లెల్సీ నుంచి ఆధారపడిన సీపీడబ్ల్యూఎస్ పథకానికి సంబం ధించి నీటిని విడుదల చేసుకుని 16 ఎస్‌ఎస్ ట్యాంకులలో నీటిని స్టోరేజీ చేసుకుంటున్నారా..? ఒక వేళ ఎల్లెల్సీ నుంచి నీరు రాకపోయినా ఎస్‌ఎస్ ట్యాంకులలో స్టోర్ చేసుకున్న నీటిని ఎన్ని రోజుల వరకు ఉపయోగిం చుకోవచ్చు అనే వివరాలను ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని అడిగి తెలుసుకు న్నారు. జిల్లాలో మొత్తం ఎన్ని హ్యాబిలిటేషన్స్ ఉన్నాయి.. అందులో జూన్ నెల చివరి వరకు ప్రతి రోజు నీటిని ఎన్ని హ్యాబిటేషన్స్‌కి ఇవ్వగలం, రోజు మార్చి రోజు ఎన్ని హ్యాబిటేషన్స్‌కి ఇవ్వగలం, ఏ సోర్సెస్ ద్వారా ఇవ్వాలనే విషయాలను ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్ అధికారు లు సమన్వయం చేసుకుని రేపటి లోపు వివరాలను తనకు అందజే యాలన్నారు. మండలాల్లో ఎన్ని బోర్లు ఉన్నాయి.. అందులో ఎన్ని రిపేర్లు ఉన్నాయి.. రిపేర్ ఉన్న వాటిలో రిపేర్ చే యిస్తే.. ఎన్ని పని చేస్తాయనే వివరాలను కూడా అందజేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి పనులలో మొదటి ప్రాధాన్యతగా ఏప్రిల్‌లో కూలీలతో అన్ని హ్యాబిటేషన్ ప్రాంతాలలో వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్‌డబ్లూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఎపీఎస్‌పీ డీసీఎల్ ఎస్‌ఈ ఉమాపతి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి, డీపీవో నాగరాజు నాయుడు పాల్గొన్నారు.