తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉధృతి కొనసాగుతోంది. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోనే మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రానున్న వారం రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు కీలక సూచనలు చేసింది. మార్చి 27వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు మధ్యాహ్న సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వెళ్లకపోవడమే మంచిదని. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్య బయటకు వెళ్లకపోవడమే మంచిదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.