అవినీతి రహిత పాలన సీఎం జగనన్నతోనే సాధ్యం అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండల పరిధిలోని ఊటుకూరు పంచాయతీలో గల బసవనపల్లి, బసవనపల్లి కాలనీ, ఊటుకూరు, అక్కంపల్లి గ్రామాలలో మంత్రి పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జగనన్నతోనే సంక్షేమ పాలన సాధ్యం అని మంత్రి తెలిపారు.