అనంతపురంలోని ఫాదర్ ఫెర్రర్ విగ్రహం వద్ద తో చనిపోయిన అంజలి కి సంబంధించిన వివరాలను కలెక్టర్ ఎం. గౌతమి ఆరా తీశారు. ఆమె పిల్లల విద్య, వసతి గురించి వెంటనే అధికారులు స్పందించాలని ఆదేశాలను జారీ చేశారు. దీంతో బుధవారం పిల్లలను ఐసిడిఎస్ పిడి బి. యన్ శ్రీదేవి, ఐసీపీఎస్ ప్రొటెక్షన్ ఆఫీసర్ చంద్ర కళ సమక్షంలో అమ్మాయిని స్థానిక బాలసదనం, అబ్బాయిలను ఇద్దరినీ జీవని రోటరీపురం ఆర్ఫన్ హోంలో చేర్పించారు.