పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని 25, 27, 30 వార్డులకు చెందిన 200 మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. వారందరికీ మంత్రి కారుమూరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి శ్రీవెంకట సుబ్బారావు, వైయస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య తదితరులు పాల్గొన్నారు .