విశాఖ దక్షిణ నియోజక వర్గంలో ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నడూ లేనట్టు అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. అయన మాట్లాడుతూ.. ఇరికిరుకు సందుల్లో 100 అడుగుల, 60 అడుగుల రోడ్లను వేసింది వైయస్ఆర్సీపీ ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో విశాఖపట్నం మేయర్ గోలగాని హరి వెంకట కుమారి, వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోలాగురువులు పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ ద్రోణంరాజు శ్రీవాస్తవ, జిల్లా గ్రంధాలయం అధ్యక్షులు కొండా రాజీవ్, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం దుర్గాలమ్మ కోవెల నుంచి పూర్ణ మార్కెట్, 35 వ వార్డు ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.