దేశ ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం 90 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, జగన్మోహన్ రెడ్డి నాలుగు వేళ్ళ పాలనలలో అభివృద్ధిలో 40 ఏళ్లు తిరోగమన దశలో పయనిస్తుందని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహయాదవ్ అన్నారు. మంగళ వారం నంద్యాల కార్యాలయంలో మాట్లాడుతూ ఇటీవల మోడీ, జగన్ తమ స్వార్ధ రాజకీయాలతో ఈ దేశానికి, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.