రాచర్ల మండలం అనుముల వీడు గ్రామంలో గురువారం ఓ విద్యుత్ స్తంభం నెలకొరిగింది. విద్యుత్ స్తంభం నేలకొరిగిన సమయంలో విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. విద్యుత్ స్తంభం నేలకొరిగిన సమయంలో అక్కడ ఎవరు ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానిక ప్రజలు అంటున్నారు. తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా స్థానిక ప్రజలు సమాచారం అందించడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పింది.