రాజాం అసెంబ్లీ పరిధిలో వంగర మండలం కొట్టిశ, లక్ష్మీపేట, గీతనాపల్లి గ్రామాల్లో రాజాం ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ తలే రాజేష్ బుధవారం ‘ఇంటింటికీ వైసీపీ’ ప్రజాదీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కలిగిన లబ్ధి, రాజాం అసెంబ్లీలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. కరపత్రాలను ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ తలే రాజేష్, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు.