రాజాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ బుధవారం వంగర మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీతాదేవిపురం, మరువాడ, కింజంగి గ్రామాలలో పర్యటించారు. చంద్రబాబు రూపకల్పన చేసిన సూపర్ సిక్స్ పథకాలు, బీసీ డిక్లరేషన్ పై వివరించారు. రాష్ట్రంలో అధిక ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ. 8 లక్షల భారం మోపారన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి 10రూపాయలు ఇచ్చి వంద దోచుకొంటున్నారన్నారు.