ఇంటికి కిలో బంగారమిచ్చినా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు ఓటమి తప్పదని నారా లోకేష్ అన్నారు. అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన జనం... జగన్‌ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో బంధించాలని నిర్ణయానికొచ్చారన్నారు. ఈ నేపథ్యంలో చీప్ ట్రిక్స్‌తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెందిన గోడౌన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్‌ను అధికారులు పట్టుకున్నారని నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్‌నైతే పట్టుకున్నారన్నారు. మరి ఇసుక, లిక్కర్‌లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారని లోకేష్ ప్రశ్నించారు.