రామకుప్పం మండలం రాజుపేట వద్ద ఎఫ్ ఎస్ టీ టీమ్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంపై కర్నాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశామని ఎస్సై శివకుమార్ శనివారం పేర్కొన్నారు. 44 వేలు విలువ చేసే కర్నాటక మద్యం, ఒక ద్విచక్రవాహనం సీజ్ చేసి, యువకులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామని ఆయన వెల్లడించారు. కర్నాటక మద్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని శివకుమార్ హెచ్చరించారు.