శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం క్వింటా ఎండుమిర్చి రూ. 20 వేలు పలికింది. మార్కెట్ కు 54 క్వింటాళ్ల సరుకు రాగా, అధికారులు ఈ నామ్ పద్ధతిలో వేలం వేశారు. ఇందులో మొదటి రకం క్వింటా రూ. 20 వేలు, రెండో రకం రూ. 10 వేలు, మూడో రకం క్వింటా ఎండు మిర్చి రూ. 6 వేల ప్రకారం క్రయ విక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa