వజ్రకరూరు మండలంలోని గూళ్యపాళ్యంలో శుక్రవారం పిచ్చికుక్క కరిచి 15 మంది గాయపడ్డారు. పిచ్చికుక్క ఇళ్లలోకి చొరబడి, దారిలో వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి కరిచింది. గాయపడిన వారిలో చిన్న పిల్లలు, మహిళలు ఉన్నారు. ఒక ఎద్దు, ఆవును కూడా గాయపరిచింది. గ్రామస్థులు కుక్కను కొట్టి చంపారు. క్షతగాత్రులను గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒక మహిళను అనంతపురం తీసుకెళ్లారు.