కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ఉమామహేశ్వరనాయుడు, పలువురు సీనియర్ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పత్తికొండలో `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర స్టే పాయింట్ వద్ద వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడీపీ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో పలువురు కీలక నేతలు వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ వారికి వైయస్ఆర్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో టీడీపీ సీనియర్ నేత మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వై.నారాయణ, మాజీ ఎంపీపీ, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె కొల్లప్ప, టీడీపీ పార్లమెంట్ సెక్రటరీ, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ టి సత్యప్ప, జనరల్ సెక్రటరీ(కంబదూరు) పి ఆనంద్ చౌదరి, కళ్యాణదుర్గం రూరల్ జనరల్ సెక్రటరీ కె మల్లిఖార్జున, జనరల్ సెక్రటరీ(శెట్టూరు) ఆదిశేషు, కళ్యాణదుర్గం రూరల్ ఎంపీటీసీ బి. ఓబయ్య, కంబదూరు మాజీ జెడ్పీటీసీ అభ్యర్ధి మంజునాథ్ చౌదరి, శెట్టూరు మాజీ మండల పార్టీ కన్వీనర్ పి రంగనాథ్ శెట్టిలు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa