మార్చిలోనే ఎండలు మాడు పగలగొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం వేడి వాతావరణం కొనసాగింది. రాయలసీమ, ఉత్తర కోస్తాల్లోని పలు చోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి. నంద్యాల జిల్లా అవుకులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముందని పేర్కొంది.
ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, వైయస్‌ఆర్ కడప జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కేంద్రం హెచ్చరించింది. ‘సోమవారం ఒక మండలంలో తీవ్ర, మరో 64 మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాలులు వీచే అవకాశం ఉంది... శనివారం విజయనగరం, అనకాపల్లి, నంద్యాల, వైయస్‌ఆర్ జిల్లాల్లో తీవ్ర వడగాలులు, మరో 52 మండలాల్లో ఓ మాదిరి వడగాలులు వీచాయి’ అని వివరించింది. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, వైఎస్ఆర్ జిల్లాలో ఆది, సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకుపైనే నమోదవుతాయని హెచ్చరించింది. వీలైనంత వరకూ ఇంటిలోనే ఉండాలని, దాహం వేయకపోయినా తరుచూ నీటిని తాగాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa