ఆర్థిక పతనం అంచున కొట్టుమిట్టాడుతున్న పాక్ ఆర్థిక నిర్వహణను మెరుగుపర్చేందుకు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, సీనియర్ అధికారుల పర్యటనల సందర్భంగా ఏర్పాటు చేసే ఎర్రతివాచి స్వాగతాలపై నిషేధం విధించారు. ఈ విషయంపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. విదేశీ అధికారుల పర్యటన సమయాల్లో ఈ సంప్రదాయం కొనసాగనుంది.