రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పింఛన్ల పంపిణీని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని విజ్ఞప్తి చేశారు.
వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులకు నగదు రూపంలో పింఛను మొత్తం చెల్లించాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందితో పంపిణీ జరిపేలా చూడాలని కోరారు.