విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడం బకాయలు రూ. లక్షల్లోకి పెరిగిపోవడంతో సచివాలయాలకు సరఫరా నిలుపుదల చేస్తూన్నారు. అచ్యుతాపురం మండలంలో తిమ్మరాజుపేట, పెదపాడు, ఖాజీపాలెం, చోడపల్లి సచివాలయాలకు ఆదివారం సరఫరా అధికారులు నిలిపివేశారు. బిల్లులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు నోటీ సులు అందించామని స్పందించక పోవడంతో ఉన్నతాధికారుల అదేశాలు మేరకు సరఫరా కనెక్షన్ తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.