టీడీపీ నాయకులకు వాలంటీర్లు అంటే ఎందుకింత భయమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన నాతవరంలో మాట్లాడారు. ప్రతీ నెలా 1వ తేదీనే వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని,
అయితే ఏప్రిల్ 1వ తేదీన వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ జరగకుండా చంద్రబాబు కుట్రలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. వాలంటీర్లను పక్కన పెట్టడం బాధాకరమన్నారు.