విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పశుగణాభివృద్ధి సంఘం విశాఖ జిల్లా చైర్మన్, భీమిలి మండల జడ్పీటీసీ గాడు వెంకటప్పడు తన అనుచరులతో కలిసి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ హయాంలో కక్ష సాధింపులు తప్ప.. అభివృద్ధి దిశగా పాలన లేదని వెంకటప్పడు వ్యాఖ్యానించారు. తనతో పాటు సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, 30 మంది వార్డు మెంబర్లు, సచివాలయ కన్వీనర్లు, 100 మంది వైసీపీ నేతలు రాజీనామా చేశారన్నారు.