గాజువాక పారిశ్రామిక ప్రాంతం నుంచి విశాఖ నగరం లోకి వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనను ( డాక్ యార్డ్ వంతెన) ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మూసి వేస్తున్నట్టు విశాఖ పోర్టు అథారిటీ యాజ మాన్యం సోమవారం ప్రకటించింది.
ఆదివారం వంతెన సమీపంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. 9 నెలల పాటు వంతెనకు మరమ్మతులు చేసేందుకు మూసివేస్తున్నట్టు పోర్టు యాజమాన్యం వెల్లడించింది.