కళ్యాణదుర్గం మండలం మంగళకుంట గ్రామంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు భార్య రమాదేవి, కోడలు ఇషిత, సోదరి రాధా మాధవి, కుటుంబ సభ్యులు సోమవారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలకు తెలియజేశారు.