జిల్లాలో ప్రసిద్ధి చెందిన సుగుటూరు గంగమ్మ జాతర పుంగనూరు పట్టణంలో మంగళ, బుధవారాలలో జరగనుంది. ఈ జాతరను పుంగనూరుతో పాటుగా 100 గ్రామాలలో వైభవంగా నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రికి నగిరి ప్యాలెస్ లోని జమీందారుల ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిమకు పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి బుధవారం తెల్లవారుజామున జమీందారుల ప్యాలస్ వద్ద ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.