ఎలుగుబంటి హల్‌చల్ చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరులో చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున గ్రామంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి చొరబడింది. గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ పరిసరాల నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఎలుగుబంటి బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేక వైద్య, అటవీ బృందాల సాయంతో బంధించే ఏర్పాట్లు చేస్తున్నారు.