ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. రెండు రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఏప్రిల్ 23న ఫలితాలను ప్రకటించాలని.. అలాగే ప్రోగ్రెస్ కార్డులు కూడా అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా, ఈ నెల 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. జూన్ 11 వరకు సెలవులు ఉంటాయి.