రాప్తాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా సాకే శంకర్ ను నియమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈయన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈయన మొదటినుంచి కాంగ్రెస్ పార్టీ నే అంటిపెట్టుకొని క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉండటంతో పార్టీలో మంచి గుర్తింపు ఉంది.