ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తూ జనసేన నేత పవన్ కల్యాణ్, పోతిన వెంకట మహేష్ చిత్రాలతో కూడిన ప్లెక్సీపై సంతకాలు సేకరిస్తున్న ఇద్దరు జనసైనికులపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ నియోజకవర్గం సీటు పోతిన వెంకట మహేష్ కు కేటాయించాలని కోరుతూ జనసేన కార్యకర్తలు సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడకు చేరుకోని పోలీసులకు ఫిర్యాదు చేశారు.