చక్రాయపేట మండల పరిధిలోని కేఎర్రగుడి గ్రామం, బిఎన్ తండా, గరుగు తండాల్లో బుధవారం వైస్సార్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల ఇన్చార్జి వైయస్ కొండారెడ్డి, మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి, జెడ్పిటిసి శివప్రసాద్ రెడ్డి, ఎంపీపీ మాధవి బాలకృష్ణ, సర్పంచ్ హరి శేఖర్ నాయుడు, మండల ఉపాధ్యక్షుడు అబ్దుల్ గఫార్ లు ఇంటింటికి తిరిగి వైసీపీని గెలిపించాలన్నారు.